Sunday, May 5, 2024

ఓటమి బాధతో యువ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యువ క్రీడాకారిణి, రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహ‌త్యకు పాల్పడింది. ప్రముఖ రెజ్లర్లు గీతా, బ‌బితా ఫోగాట్‌ల సోదరీ రితికా బుధవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల రితికా ఫోగాట్ రాష్ట్ర స్థాయి స‌బ్ జూనియ‌ర్‌, జూనియ‌ర్ టోర్నీల్లో ఆడుతోంది. ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం హర్యానాలోని భ‌ర‌త్‌పూర్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోయాననే బాధ‌తోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మహావీర్ ఫోగాట్‌, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు గీతా, బ‌బితా ఫోగాట్‌ల‌పై బాలీవుడ్‌లో దంగ‌ల్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.

Rithika Phogat dies by suicide

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News