Sunday, April 28, 2024

అటవీశాఖ కొత్త సారధిగా ఆర్.ఎం. డోబ్రియల్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్)గా రాకేష్ మోహన్ డోబ్రియల్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం పిసిసిఎఫ్ ఆర్.శోభ పదవీ విరమణ పొందడంతో డోబ్రియల్‌కు ఈ బాధ్యతలతో పాటు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పిసిసిఎఫ్‌గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరారు.

1989లో పాల్వంచ సబ్ డీఎఫ్‌ఓగా మొదటి పోస్టులో అపాయింట్ అయ్యారు. -94 వరకు భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదాలో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందిన తర్వాత అడిషనల్ సెక్రటరీ హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో వివిధ హోదాల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. 2015లో అదనపు పిసిసిఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016లో తెలంగాణకు హరితహారం నోడల్ ఆఫీసర్ గా నియమితులై ఇప్పటి వరకు పనిచేశారు. హరితహారం, పచ్చదనం పెంపునకు అన్ని శాఖల సమన్వయంలో డోబ్రియల్ కీలకపాత్ర పోషించారు. 2020లో పిసిసిఎఫ్ ర్యాంకు పొందిన ఆయన 2025 ఏప్రిల్ వరకు సర్వీసులో కొనసాగుతారు.

డోబ్రియల్‌ను అభినందించిన మంత్రి

రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. అదే విధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్. శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఆఫీసర్ల సంఘం, సిబ్బంది అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News