Sunday, April 28, 2024

ఇందిరాపార్క్‌లో దొంగల బెడద

- Advertisement -
- Advertisement -

 Indira Park

 

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించే ఇందిరాపార్క్‌లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పార్కును సందర్శిస్తున్న పర్యాటకుల పర్సులను దొంగలు కొట్టేస్తున్నారు. దీంతో పర్యాటకులు లబోదిబోమంటున్నారు, తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పార్క్‌ను చూస్తామని వచ్చేవారి పర్సులను కొట్టేయడంతో ఏమి చేయాలో తోచక పర్యాటకులు దిక్కులు చూస్తున్నారు. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పర్సు కొట్టేయడంతో అందులోని రూ.5,000 పోయాయి. ఇందిరా పార్క్‌లో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా సరిగా పట్టించుకోకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. లోపల సిసి కెమెరాలు లేకపోవడంతో దొంగల పని సులభమవుతోంది.

పర్యాటకుల పర్సులు కొట్టేసేందుకే దొంగలు ఇందిరాపార్క్‌కు వస్తున్నారు. అలాగే వాకింగ్ చేస్తున్న ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 5గంటలకు వాకర్స్ పార్క్‌కు వస్తుంటారు. ఈ సమయంలో వాకింగ్ చేస్తుండగా వీధిదీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు దారి కన్పించక కిందపడిపోవడంతో గాయలపాలవుతున్నారు. నీటి ఫౌంటేన్లు,నీటి కాలువల్లో చెత్త పేరుకు పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రానున్నది వేసి కాలం కావడంతో పార్క్‌లు సౌకర్యాలు కల్పించడంతోపాటు భద్రత ఏర్పాట్లు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. దొంగల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. వెంటనే పోలీసులు నిఘా పెట్టాలని, దొంగలను అదుపు చేయాలని వాకర్స్ కోరుతున్నారు.

పార్కింగ్‌లో హెల్మెట్లు మాయం…
ఉదయం సమయంలో వాకింగ్ వస్తున్న వారు పార్కింగ్‌లో వాహనం పెట్టి బైక్‌కు హెల్మెట్ పెట్టి వెళ్లి వచ్చే సరికి మాయం అవుతున్నాయి. ఈ విధంగా రోజుకు ఐదు హెల్మెట్లు మాయం అవుతున్నాయని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో నిఘాపెట్టాలని బైక్‌లు, హెల్మెట్లు చోరీకి గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, దొంగల బెడదను నుంచి కాపాడాలని కోరారు. ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్‌కు రావడం ఏమోకాని రోజుకు హెల్మెట్లు మాయం అవుతుండడంతో వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Robbers at Indira Park
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News