Wednesday, May 1, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పర్యావరణానికి మేలు

- Advertisement -
- Advertisement -

Green India Challenge

 

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం నెల్లూరులో మొక్కలు నాటారు. నగరి ఎమ్మెల్యే సినీ నటి రోజా ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను అనిల్ కుమార్ యాదవ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, హీరో అర్జున్‌లకు మంత్రి అనిల్‌యాదవ్ ఈ సందర్భంగా గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి అనిల్ పేర్కొన్నారు. రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా, టిఆర్‌ఎస్ ఎంపి సంతోష్ కుమార్‌లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.

మొక్కలు నాటిన హీరో అర్జున్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటడంతో పాటు మరో ముగ్గురికి గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. స్వయంగా రోజా వెళ్లి అర్జున్‌తో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న సంకల్పం గొప్పదన్నారు. రోజా కూడా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమ న్నారు. జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి, నటి కుష్బులకు అర్జున్ గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.

Benefit the Environment with Green India Challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News