Friday, April 26, 2024

కోహ్లికి టెన్నిస్ గ్రేట్ ఫెదరర్ ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

Roger Federer challenge to Virat Kohli

 

లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓ ఛాలెంజ్ విసిరాడు. ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఉత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. దీంతో ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. దీంతో ప్రముఖ క్రీడాకారులంతా సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. ఇక, టెన్నిస్ లెజెండ్ ఫెదరర్ ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ప్రముఖులకు ఓ సరదా ఛాలెంజ్‌ను విసిరాడు. భారత కెప్టెన్ కోహ్లికి కూడా ఈ ఛాలెంజ్ ఎదురైంది. ట్రైనింగ్ ఫ్రమ్ పేరిట ఫెదరర్ సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్ విసిరాడు. ఫెదరర్ ఒక్కడే టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొడుతూ సోలో డ్రిల్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అందరికి ఉపయోగకరమైన సోలో డ్రిల్‌ను మీరెలా చేస్తారో వీడియోతో రిప్లై ఇవ్వండి అని ఫెదరర్ కోరాడు. ఇక, ఫెదరర్ ఛాలెంజ్‌కు చాలా మంది క్రీడా ప్రముఖులు స్పందించారు.

Roger Federer challenge to Virat Kohli
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News