Saturday, April 27, 2024

ఏం భయం లేదు

- Advertisement -
- Advertisement -

etela rajender

 

రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్‌వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం : మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా భయం క్రమంగా తగ్గుతోందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన వ్యా ఖ్యానించారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం కొత్త గా మరో 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఎక్కడా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ బా రిన పడి పూర్తిగా కోలుకొని 45 మంది డిశ్చార్జ్ కాగా, 11 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరు ఐసియూలో లేరన్నారు. ప్రస్తుతం మర్కజ్ లింక్ ద్వారానే కేసులు పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని తబ్లీగి జమాత్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

వీరిని ప్రత్యక్షంగా కలసిన 3వేల మందిని క్వారంటైన్ చేశామని, వీరిలో 500 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కిట్ల కొరత లేదని, కొందరు కావాలనే దుష్ఫ్రచారం చేయడం బాధకరమని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఆధీనంలో ప్రస్తుతం 80వేల పిపిఇ కిట్లు ఉండగా, మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. అదే విధంగా ఎన్ 95 మాస్కులు ఒక లక్ష ఉండగా, మరో 5 లక్షల మాస్కులు, 2 కోట్లు డాక్టర్ మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని మంత్రి తెలిపారు. దీంతో పాటు గ్లౌజ్‌లు 20 లక్షలు ఉండగా, కోటి గ్లౌజ్‌ల కోసం ఆర్డర్ ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు తుంపర్లు నేరుగా కళ్లలోకి పడకుండా వినియోగించే గాగుల్స్ ప్రస్తుతం లక్ష ఉండగా, మరో ఐదు లక్షలకు ఆర్డర్ ఇచ్చామని మంత్రి అన్నారు. అంతేగాక అనుమానిత లక్షణాల వారి శాంపిల్స్‌ను పరీక్షించేందుకు 3.50 లక్షల కిట్లు ఆర్డరిచ్చామని మంత్రి పేర్కొన్నారు.

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది..
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల తెలిపారు. కేవలం 15 రోజుల్లో 1500 బెడ్లను అందుబాటులోకి తేవడం గమనిస్తే ప్రభుత్వ పనితీరు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో ఎక్కడ మందుల కొరత లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటికే నెగటివ్ వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామని ఆయన తెలిపారు. తొలి విడద క్వారంటైన్‌కి వచ్చిన వారి పీరియడ్ గురువారంతో పూర్తవుతోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం కేవలం మర్కజ్ లింక్ వాళ్లు మాత్రమే క్వారంటైన్‌లో ఉన్నారని ఆయన అన్నారు. రెండు డిజిట్‌లు వస్తున్న కేసులు సంఖ్య మరో వారంలో సింగల్ డిజిట్‌కి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు గాంధీ, చెస్ట్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్నామని, అయితే చెస్ట్, కింగ్ కోఠి ఆసుపత్రులలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులు డిశ్చార్జ్ అయిన కాగానే, ఆ తర్వాత వచ్చే కేసులన్నిటిని కేవలం గాంధీ ఆసుపత్రికే పంపిస్తామని మంత్రి చెప్పారు.

వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు..
రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు, నర్సులకు, ఇతర సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యసిబ్బందిని ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. పెద్ద మనసు చేసుకొని కరోనాతో వచ్చిన రోగులందరినీ చల్లగా కాపాడాలని మంత్రి చెప్పారు.

జిల్లాల వారీగా కేసులు సంఖ్య..
ఆదిలాబాద్ 11, భద్రాద్రి 2, హైదరాబాద్ 161, జగిత్యాల 3, జనగాం 2, జయశంకర్ 2, జోగులాంబ 22, కామారెడ్డి 10, కరీంనగర్ 7, మహాబూబాబాద్ 1, మహబూబ్‌నగర్ 10, మెదక్ 5, మేడ్చల్ 18, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గొండ 14, నిర్మల్ 10, నిజామాబాద్ 39,పెద్దపల్లి 2, రంగారెడ్డి 27, సంగారెడ్డి 7, సిద్దిపేట్ 1, సూర్యపేట్ 9, వికారాబాద్ 5, వరంగల్ అర్బన్ 23, ఖమ్మం 2.

కరోనా పేషెంట్లలో 80 మంది మహిళలు..
మంగళవారం బులిటెన్ ప్రకారం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 80 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. దీనిలో ఎక్కువగా హైదరాబాద్ వాళ్లే ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో పన్నెండేళ్ళలోపువారు 15మంది, 22 ఏళ్ళలోపువారు 39 మంది, 32 ఏళ్ళలోపువారు 92 మంది, 42 ఏళ్ళలోపువారు 79 మంది, 52 ఏళ్ళలోపువారు 76 మంది, అరవై ఏళ్ళలోపువారు 50 మంది చొప్పున ఉన్నారు. అయితే వీరిలో దాదాపు 80 శాతం మంది మర్కజ్ లింక్ ద్వారనే వైరస్ బారిన పడ్డారని అధికారులు పేర్కొంటున్నారు.

Corona is decreasing in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News