Tuesday, April 30, 2024

‘ఆ కారణంతోనే రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు ఇచ్చాం’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోహిత్ శర్మకు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించడంతో తీవ్ర ఒత్తిడికి లోనుఅవుతున్నాడని ఆ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. రోహిత్‌పై ఒత్తడి తగ్గించడానికే అతడికి బదులుగా హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని వివరణ ఇచ్చాడు. రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ నుంచి తొలగించి హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడంతో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. రోహిత్ చాలా సంవత్సరాల నుంచి ముంబయి ఇండియన్స్‌గా కెప్టెన్‌గా ఉన్నాడని, గత రెండు సీజన్ల నుంచి అతడిపై కెప్టెన్ భారం పడడంతో బ్యాటింగ్ పై దృష్టి పెట్టలేదని చెప్పారు.

ముంబయి, టీమిండియాకు కెప్టెన్‌గా రోహిత్ కు మంచి రికార్డు ఉందని ప్రశంసించాడు. గత రెండు ఐపిఎల్ సీజన్లలో 126.84 స్ట్రైక్‌రేటుతో 600 పరుగులు చేశాడని బౌచర్ గుర్తు చేశాడు. బ్యాట్స్‌మెన్‌గా అతడు జట్టులో ఉంటే ఎంతో ఉపయోగం ఉంటుందని వివరణ ఇచ్చాడు. కెప్టెన్ భారం లేకుండా అతడు బ్యాటింగ్ చేస్తే పరుగులు తీస్తాడని కితాబిచ్చాడు. ఈ వ్యవహారంపై రోహిత్ శర్మ సతీమణి రితిక కూడా సోషల్ మీడియాలో స్పందించారు. దీని వల్ల చాలా తప్పులు జరిగాయని పోడ్ కాస్ట్ లో ఆమె కామెంట్ చేసింది.

2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండి ఐదు టైటిల్‌లు అందించాడు. ఐపిఎల్‌లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్‌కు నాలుగు ఐపిఎల్ కప్‌లు అందించి రెండో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News