Sunday, May 5, 2024

వైట్‌హౌస్ చీఫ్‌గా రాన్ నియామకం

- Advertisement -
- Advertisement -

ron klain appointment as White House chief

వాషింగ్టన్: వైట్‌హౌస్ సిబ్బంది అధినేతగా రాన్ క్లెయిన్ నియమితులు అయ్యారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ చేపట్టిన తొలినియామకం ఇదే అయింది. ప్రముఖ రాజకీయ కార్యనిర్వాహకుడిగా క్లెయిన్‌కు పేరుంది. సుదీర్ఘకాలంగా తనకు సన్నిహితుడిగా సహకరిస్తూ వస్తున్న వ్యక్తికి వైట్‌హౌస్ అత్యున్నత బాధ్యతలను బైడెన్ కట్టబెట్టారు. సాధారణంగా వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్ ప్రెసిడెంట్‌కు ఆంతరంగికుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. రోజువారి ప్రెసిడెంట్ కార్యకలాపాల ఖరారు, రాజకీయ పరిస్థితి గురించి తెలియచేయడం వంటివి చేపడుతారు. ఓ విధంగా ప్రెసిడెంట్‌కు ద్వారపాలకుడిగా ఉండాల్సి ఉంటుంది. కేవలం స్టాఫ్ బాధ్యతలే కాకుండా 59 ఏళ్ల క్లెయిన్ తనకున్న అనుభవంతో సరైన అనుభవజ్ఞులతో కూడిన నూతన శ్వేతసౌథ సిబ్బందిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు తక్షణ సమస్యలపై తగు సలహాలు ఇస్తూ ఉండాల్సి ఉంటుందని, ఇవి అదనపు బాధ్యతలని బైడెన్ తాత్కాలిక కార్యాలయం నుంచి వెలువడ్డ ప్రకటనలో తెలిపారు. రాన్ గురించి బైడెన్ తాజాగా ప్రశంసయుత ప్రకటన వెలువరించారు. ఆయన తనకు చాలా విలువైన వ్యక్తి అని, చాలా ఏళ్లుగా కలిసి పనిచేశామని, పైగా 2009లో అమెరికాఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజారుతూ పోతున్న దశ నుంచి తట్టుకుని ముందుకు సాగేలా చేశామని వివరించారు. 2014లో దేశంలో ఆరోగ్య విషమ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే దిశలో యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. ఇప్పటివరకూ బైడెన్‌కు రాన్ క్లెయిన్ ప్రచారం విషయంలో సీనియర్ సలహాదారుడిగా ఉంటూ వస్తున్నారు. బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నదశలో రాన్ ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాప్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతున్న దశలో అదే పదవిని పొందుతున్నారు.

ron klain appointment as White House chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News