Friday, May 3, 2024

సిఎం కుర్చీలో ఎవరున్నా.. ప్రజల గుండెల్లో మేమే ఉన్నాం

- Advertisement -
- Advertisement -

Tejashwi Yadav Comments on Nitish Kumar

పాట్నా: బీహార్ పీఠంపై నితీశ్ కుమార్ కూర్చున్నా ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్‌జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, సిఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా తానే విజేతనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కితీశ్ కుమార్‌లు ధనబలం, కండబలంతో పాటు అనేక ఎత్తుగడలు వేసినా 31 ఏళ్ల యువకుడినైన తనను ఆపలేకపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్‌జెడినే అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని ఆపలేకపోయారన్నారు. ‘ నితీశ్ జనాకర్షణ ఎక్కడికి పోయిందో చూడండి. ఆయన మూడో స్థానానికి పరిమితమైనారు. మార్పునకు ఇదో తీర్పు. నితీశ్ సిఎం పీఢంపై కూర్చున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం మనమే ఉంటాం’ అని తేజశ్వి అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహాఘట్‌బంధన్ సంఖ్యా బలాన్ని కూడగడుతుందా అని అడగ్గా, ‘తీర్పు ఇచ్చిన ప్రజల ముందుకు మేము వెళ్తాం. వారుగనుక అలాంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం’ అని ఆయన అన్నారు.

కాగా ఎన్‌డిఎకు, తమకు మధ్య ఓట్ల తేడా 12,270 మాత్రమేనని తేజశ్వి అన్నారు. ఆ ఓట్లతోనే 15 సీట్లను ఎన్‌డిఎ గెలుచుకోగలిగిందన్నారు. చాలా తక్కువ ఓట తేడాతోనే 20 సీటలో తాము ఓడిపోయామన్నారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో900 పోస్టల్ ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని, ఇంత భారీ సంఖ్యలో ఆ ఓట్లను ఎవరి ఒత్తిడితో రద్దు చేశారని ప్రశ్నించారు. అలా రద్దు చేసిన చోట తిరిగి రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కండబలం, ధనబలంతోనే ఎన్‌డిఎ గెలిచిందన్నారు.‘ అని తేజశ్వి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన నితీశ్‌కుమార్ తన ఆత్మ ప్రబోధానుసారం సిఎం పీఠానికి దూరంగా ఉండారా?’లోపాలను ఎత్తి చూపుతూ మహాకూటమి ఎన్నికలకు లేఖ రాస్తుందని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News