Friday, May 3, 2024

ఆర్‌టిసిలో ఛార్జీల రౌండప్

- Advertisement -
- Advertisement -

Round figer charges in TSRTC

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పల్లెవెలుగు బస్సుల్లో నెలకొన్న చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసి యాజమాన్యం ముందుకు వచ్చింది. రౌండ్ ఫిగర్ రేట్లను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో చాలా రూట్లలో చార్జీలు పెరగ్గా, మరికొన్ని రూట్లలో తగ్గనున్నాయి. గతంలో టికెట్ ధరలు రూ.12.50 పైసలు, రూ.13.30 పైసలు ఇలా ఉండేవి. ఇక నుంచి రూ.12 ఉన్న చోట రూ.10, రూ.13 ఉంటే రూ.15 ఇలా రౌండ్ ఫిగర్ చేసి వసూలు చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. 80 కిలోమీటర్ల దూరానికి ఇప్పటివరకు రూ.67లు వసూలు చేస్తుండగా రౌండప్ చార్జీల నేపథ్యంలో దానిని రూ.65ల చార్జీగా ఆర్టీసి నిర్ధారించింది. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి ఎండి సజ్జనార్ వెల్లడించారు. అంతేగాకుండా, టోల్‌ప్లాజాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఆర్డినరీకి రూ.1, హైటెక్, ఎసి బస్సులకు రూ.2లను అదనంగా వసూలు చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News