Saturday, April 27, 2024

వంద ఫీట్ల రోడ్డులో హత్య.. మృతుడిపై రౌడీషీట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః రౌడీషీటర్‌ను హత్య చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంద ఫీట్ల రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బోరబండకు చెందిన నదీం పలు నేరాలు చేయడంతో పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు వందఫీట్ల రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని హత్య చేసిన నిందితుల కోసం స్థానికంగా ఉంటున్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News