Tuesday, April 30, 2024

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ‘హిమాలయన్’ లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అడ్వెంచర్ మోటారు సైకిల్ హిమాలయన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. గోవాలో జరిగిన మోటోవెర్స్ ఈవెంట్‌లో దీన్ని లాంచ్ చేసింది.దీని ధర రూ.2.69 లక్షలనుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇది లాంచింగ్ ఆఫర్ మాత్రమే.డిసెంబర్ 31 తర్వాత దీని ధర పెంచుతామని కంపెనీ తెలిపింది. కొత్త హిమాలయన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్‌ను మౌంటెయిన్‌గా పిలుస్తారు. ఇది కాజా బ్రౌన్ రంగులో లభిస్తుంది. మిడ్ వేరియంట్‌ను పాస్‌గా పిలుస్తారు. ఇది స్లేట్ హిమాలయన్ సాల్ట్, స్లేట్ హిమాలయన్ గా పిలుస్తారు.

దీని ధర రూ.2.74 లక్షలుగా నిర్ణయించారు. ఇక టాప్ వేరియంట్‌ను పీక్‌గా వ్యవహరిస్తున్నారు.ఇందులో క్యామెట్ వైట్ ధర రూ.2.79 లోలు, హన్లే బ్లాక్ ధర రూ.2.84లక్షలుగా కంపెనీ పేర్కొంది.ఈ బైక్ కొత్తగా అభివృద్ధి చేసిన షెర్పా450 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.ఇందులో 450 సిసి సింగిల్‌సిలిండర్, లిక్విడ్ కూల్డ్ యూనిట్ ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల్లో తొలిసారిగా ఈ ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఇంజిన్ 39.4హెచ్‌పి గరిష్ఠ శక్తిని,40 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. స్లిప్పర్ క్లచ్‌తో6స్పాడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేశారు. దీనిలో అడ్జస్టబుల్ సీటు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News