Thursday, May 2, 2024

ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు
మయాంక్ సెంచరీ వృధా

షార్జా : ఐపిఎల్ టోర్నిలో భాగంగా ఆదివారం పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 3 బంతులు మిగిలుండగానే ఛేదించింది. సంజుసామసన్(42 బంతుల్లో 85), స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50), చివర్లో రాహుల్ ‌థివాతీయా (31 బంతుల్లో 53), సిక్సర్లతో చెలరేగడంతో అసాధ్యం అనుకున్న విజయం రాజస్థాన్‌ను వరించింది. మొదట్లో రాహుల్ పరుగులు తీసేందుకు విజృ ంభించినా కాట్రెల్ వేసిన 18వ ఓవర్లలో 5 సిక్స్‌లు బాదీ మ్యాచ్ స్వరూపాన్నె మార్చేశాడు. అంతుకు ముందు టాస్ ఓడి బాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కెల్ రాహుల్ ప్రత్యార్థి బౌలర్లపై విరుచుకు పడడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్‌లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్ (9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.

RR Win by 4 wickets against KXIP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News