Friday, May 10, 2024

బర్త్‌డే కానుకగా స్పెషల్ ట్రీట్..

- Advertisement -
- Advertisement -

RRR team to give special gift to Charan fans

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ’ఆర్.ఆర్.ఆర్’(రౌద్రం రణం రుధిరం). ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ’కొమురం భీమ్’గా నటిస్తుండగా.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ’అల్లూరి సీతారామరాజు’గా కనిపించనున్నాడు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈనెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ట్వీట్ చేస్తూ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే అభిమానుల కోసం ట్రీట్ రెడీ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ‘రామరాజు’ అవతారంలో కనిపించే కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే దీనిపై కొందరు చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. మరికొందరు మాత్రం పోస్టర్ కాకుండా ఏదైనా చిన్న వీడియో వదలమని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే గత ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా ’ఆర్.ఆర్.ఆర్’ నుంచి ’భీమ్ ఫర్ రామరాజు’ అంటూ చరణ్ ఇంట్రో వీడియోని వదిలారు. ఇప్పుడు ’రామరాజు’ అవతార్ లో చరణ్‌ను చూపించబోతున్నారు. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ అందించే చెర్రీ బర్త్ డే కానుక ఎలా ఉంటుందో చూడాలి.

RRR team to give special gift to Charan fans

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News