Saturday, May 4, 2024

రెండో రోజు రైతుబంధు రూ.1278 కోట్లు జమ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండవ రోజు రైతుబంధు ఖాతాలకు రూ.1278.60కోట్లు జమ చేసింది. మంగళవారం నాడు రాష్ట్రంలోని 16,98,957మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందింది. సోమవారం నుంచి ప్రభుత్వం 11వ విడతగా వానాకాల పంటల సాగుకు రైతుబంధు నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

రెండు రోజుల్లో మొత్తం 39,54,138మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1921.18కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకం అమలు ద్వారా తెలంగాణలో సాగు విప్లవం వచ్చిందన్నారు. సాగునీటి రాక, ఉచిత విద్యుత్ పంపిణీ వల్ల రాష్ట్రంలోని పంటల సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని తెలిపారు. వ్యవసాయరంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News