Wednesday, May 22, 2024

రైతాంగానికి శుభవార్త.. పిఎం కిసాన్ పథకం బకాయిలు విడుదల

- Advertisement -
- Advertisement -

రైతాంగానికి శుభవార్త.. పిఎం కిసాన్ పథకం బకాయిలు విడుదల

మొత్తం రూ 17వేల కోట్లు పంపిణీ
నేరుగా ఎనిమిది కోట్ల మంది రైతులకు

Rs 17000 Cr Released under PM Kisan Scheme

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పిఎం కిసాన్ పథకం బకాయిలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేశారు. మొత్తం రూ 17వేల కోట్లను ఈ పథకం పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైతుల కిస్తుల బాపతు కింద పంపిణీ చేస్తారు. ఆదివారం వ్యవసాయ మౌలిక సదుపాయాల సహాయ నిధి రూ లక్ష కోట్ల పథకంగా ఆవిష్కరించిన దశలోనే ప్రధాని ఈ పిఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దాదాపు 8 కోట్ల మంది రైతులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ 2వేలు చొప్పున జమ అవుతాయి. మధ్యలో దళారీలు, నేతల ప్రమేయం లేకుండా ఒకే ఒక్క క్లిక్‌తో రైతుల ఖాతాల్లోకి ఈ బకాయిలు చేరుతాయని తాము ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రతి ఏడాదికి రైతుల ఖాతాల్లోకి మొత్తం మీద రూ ఆరువేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ పిఎం కిసాన్ పథకం పరిధిలో మూడు దఫాలుగా చెల్లించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఇప్పుడు రైతులు అందుకుంటారు.

Rs 17000 Cr Released under PM Kisan Scheme

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News