Monday, May 6, 2024

రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులకు తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు లేఖ రాశారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారని, రుణమాఫీ అయ్యాక మళ్లీ రెండు లక్షల రూపాయల రుణం తీసుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ మాట నమ్మి లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని, రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్ 9న రైతుల రుణమాఫీ జరగలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదని హరీష్ రావు మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పట్లోగా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పంట మద్దతుధరపై రూ.500 బోనస్ ఇవ్వాలని, ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News