Tuesday, May 7, 2024

విద్యుత్ రంగంలో రూ. 81,516 కోట్ల అప్పులు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా భట్టి శాసన సభలో మాట్లాడారు.రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ. 62,461 కోట్లుగా ఉందని వెల్లడించారు. 31 అక్టోబర్ 2023 నాటికి రూ.81,516 కోట్ల మేర అప్పులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నెముక అని, రవాణా, సమాచార రంగా మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని భట్టి తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచించేది కూడా విద్యుత్ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News