Sunday, April 28, 2024

అత్యాధునిక ఆయుధాల తయారీకి రష్యాచైనా జట్టు : పుతిన్

- Advertisement -
- Advertisement -

Russia- China jointly develop high-tech weapons

మాస్కో : అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు రష్యా, చైనా దేశాలు జట్టు కట్టాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇప్పటికే చైనా అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థ కలిగి ఉందన్న ఆయన సాంకేతికత, అణుశక్తితోపాటు ఇతర రంగాల్లో చైనాతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్ ఈ వివరాలను వెల్లడించారు. వ్యక్తిగత అత్యాధునిక ఆయుధాల తయారీని కలసి అభివృద్ధి చేస్తున్నాం. అంతరిక్షం, విమానయాన, విమాన హెలికాప్టర్ల అభివృద్ధి లోనూ ఇరువురం సహకరించుకుంటాం. 2060 తరువాత చైనాకు కావలసిన ఇంధన వనరులను సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని పుతిన్ పేర్కొన్నట్టు అక్కడి వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. ఇక చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌తో సంబంధంపై మాట్లాడిన ఆయన ఇద్దరి మధ్య విశ్వసనీయమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ ఇవి కొనసాగుతాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News