Saturday, April 27, 2024

ఒమిక్రాన్ భయంతో ఎంపిలో రాత్రి కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

Madhya Pradesh CM announces night curfew

భోపాల్ : ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి మర్నాడు తెల్లవారు జాము 5 గంటల వరకు కర్ఫూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ప్రకటించారు. తాజాగా 23 మంది కరోనా వైరస్‌కు గురికావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,532 కు చేరుకుంది. అంతేకాదు ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 10,530 కి చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చేవారు ఎక్కువగా ఉండడం, కేసులు పెరుగుతుండడంతో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 16 రాష్ట్రాలకు విస్తరించిన ఒమిక్రాన్ మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News