Tuesday, April 30, 2024

క్యారెక్టర్ లేని సుశాంత్ కోసం కుక్కలు మొరిగాయి

- Advertisement -
- Advertisement -

Saamna slams editorial on Sushant

 

శివసేన సామ్నా ఘాటు సంపాదకీయం

ముంబై : క్యారెక్టర్ అంటూ ఏమీ లేని నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (ఎస్‌ఎస్‌ఆర్) మృతి విషయంలోరాజకీయ నేతలు, ఛానెల్స్ కుక్కల్లా మొరిగాయని శివసేన వ్యాఖ్యానించింది. పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో వెలువరించిన సంపాదకీయంలో రాజకీయ ప్రత్యర్థులపై, కొన్ని టీవీ ఛానల్స్‌పై సేన నిప్పులు చెరిగింది. ఈ పనికిమాలిన నటుడి విషయంలో కొందరు నేతలు, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. మహారాష్ట్రను, ముంబైని, ఉద్ధవ్ థాకరేను కించపరుస్తూ వ్యవహరించిన వారి నోళ్లు మూతపడ్డాయని తెలిపారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని తెలియచేస్తూ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం నివేదిక ఇచ్చిందని, మరి ఇప్పుడు సదరు వ్యక్తులు, ఆ ఛానెల్స్ క్షమాపణలు చెపుతాయా? అని శివసేన నిలదీసింది. ప్రతిష్టాత్మక ముంబై పోలీసుపై బురద చల్లిన వారు ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించింది.

సుశాంత్ మరణాన్ని తీసుకుని మొత్తం మహారాష్ట్ర పరువు తీసేందుకు కుట్ర జరిగిందని శివసేన ఘాటుగా స్పందించింది. ఈ కుట్రలో భాగంగా కుమ్మక్కై వ్యవహరించిన వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరువు నష్టం దావా వేయాల్సిందేనని శివసేన డిమాండ్ చేసింది. రాజ్‌పుత్‌ది హత్య కాదు ఆత్మహత్యనే అని, ఇది ఆయన ఉరివేసుకోవడంతో ఊపిరి ఆడకపోవడంతో సంభవించిన మరణం అని ఇటీవలే ఎయిమ్స్‌కు చెందిన ఉన్నతస్థాయి ఫోరెన్సిక్ వైద్య బృందం తేల్చిచెప్పింది. ఈ దశలోనే ఇప్పుడు సుశాంత్‌ను, ప్రత్యర్థులను టార్గెట్‌గా చేసుకుని శివసేన దాడికిదిగింది. ఓ పద్ధతి పాడూ లేకుండా ఈ నటుడు విచ్చలవిడిగా వ్యవహరించినట్లు ఇప్పటి దర్యాప్తుల క్రమంలో తేలిందని సామ్నాలో తెలిపారు. సభ్యత సంస్కారానికి దూరంగా ఉంటూ గడిపాడని, ఈ నటుడికి జీవితంలో కానీ సినిమాల్లో కానీ వైఫల్యాలు తట్టుకుని నిలిచే ఆత్మస్థయిర్యం లేదని అందుకే తనకు తానుగా ప్రాణాలు తీసుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. సుశాంత్ కేసుకు సంబంధించి కొందరు కావాలనే మహారాష్ట్రపై బురదచల్లుతున్నారని, ఇటువంటి వైఖరిని తాము సహించేది లేదని సామ్నాలో తెలిపారు.

దర్యాప్తు పేరిట ముంబై, థాకరే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించే వారిని సహిందచేది లేదని శివసేన హెచ్చరించింది. క్యారెక్టర్ లేని వ్యక్తి కేసును దర్యాప్తు చేసేందుకు ఏకంగా ఢిల్లీ నుంచి సిబిఐ బృందాలు తరలివచ్చాయని, చివరికి వారి దర్యాప్తు క్రమంలోనే ఆయన ఏ విధంగా డ్రగ్స్‌కు అలవాటుపడిందీ? ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా గడిపిందీ? తేలిందని సామ్నాలో ఘాటు పదజాలంతో తెలిపారు. సిబిఐ టెస్టుల క్రమంలో సుశాంత్ ఎంతటి క్యారెక్టర్‌లెస్ ఆర్టిస్టు అనేది స్పష్టం అయిందని శివసేన పేర్కొంది.

హీరోను విలన్ చేస్తారా? నెటిజన్ల స్పందన

మృతి చెందిన నటుడు సుశాంత్ వ్యక్తిత్వ హీనుడని, పలు రకాల దుర్వసనాలు ఉన్నాయని నిందిస్తూ శివసేన వ్యాసం వెలువడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వ్యక్తి గురించి హీనంగా స్పందించడం, పైగా ఇప్పుడు భౌతికంగా లేని వ్యక్తి గురించి మాట్లాడటం బట్టి చూస్తూ ఉంటే ఎవరికి వ్యక్తిత్వం లేదనేది తేలిందని నెటిజన్లు సామాజిక మాధ్యమంలో ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News