Thursday, May 2, 2024

వాళ్లే అత్యుత్తమ ఆల్‌రౌండర్లు

- Advertisement -
- Advertisement -

Sachin

 

ముంబై: ప్రపంచ క్రికెట్‌లోని తన అత్యుత్తమ ఆల్‌రౌండర్లను మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఎంపిక చేశాడు. తన దృష్టిలో ఈ ఐదుగురు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లు అనడంలో సందేహం లేదని ప్రకటించాడు. ఈ దిగ్గజాలతో కలిసి ఆడడం తన అదృష్టమని పేర్కొన్నాడు. భారత దిగ్గజం కపిల్‌దేవ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌లకు దన దృష్టిలో తొలి రెండు స్థానాలు దక్కుతాయన్నాడు. కెప్టెన్లుగా, ఆల్‌రౌండర్లుగా వీరు జట్టును నడిపించిన తీరు తనను ఎంతో కట్టి పడేసేదన్నాడు.

వీరినే ఆదర్శంగా తీసుకుని కెరీర్‌ను ప్రారంభించానని సచిన్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నాడు. ఇక, న్యూజిలాండ్ స్టార్ రిచర్డ్ హ్యాడ్లి, ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథం, వెస్టిండీస్ స్సీడ్‌స్టర్ మాల్కం మార్షల్ కూడా తన అత్యుత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్నారన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో వీరిని మించిన ఆల్‌రౌండర్లు మరేవరూ లేరంటే అతిశయోక్తి లేదన్నాడు. బ్యాట్‌తో, బంతితో వీరు ప్రపంచ క్రికెట్‌ను శాసించారన్నాడు. వీరిలా మెరుగైన ఆల్‌రౌండర్లు దొరకడం అంత తేలిక కాదన్నాడు. తర్వాతి తరంలో కూడా కలిస్, పొలాక్, బ్రావో, జయసూర్య వంటి ఆల్‌రౌండర్లు వచ్చినా వీరికి సాటిరారని సచిన్ స్పష్టం చేశాడు.

 

Sachin choose best all-rounders
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News