Sunday, May 5, 2024

ఇలానే మంచి పనులు చేస్తూ మీ అమ్మతో మెప్పు పొందాలి

- Advertisement -
- Advertisement -

Vijaydevarakonda

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. సెలబ్రిటీస్ తమ ఇళ్లలోనే ఉంటూ ఇంట్లో వారికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ హీరో విజయ్ దేవరకొండకు ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను విసిరారు. ఇందుకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “నన్ను మా అమ్మ పనులు చేయనివ్వట్లేదు సార్. అయినా సరే మీకోసం ఈ లాక్ డౌన్ సమయంలో ఒక వీడియో చేస్తాను”అని అన్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ తన స్టైల్లో డిఫరెంట్‌గా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. నిద్ర లేచి తన పనులు తానే చేసుకుంటూ, వాటర్ బాటిల్స్‌ను నింపుతూ… మ్యాంగో ఐస్ చేసి తన తల్లిదండ్రులకు ఇచ్చారు.

‘ది రియల్ మ్యాన్‌” అంటూ తన తండ్రిని వీడియోలో చూపించారు. సరదాగా వీడియో గేమ్ కూడా ఆడారు. అంతే కాదు ఈ లాక్ డౌన్‌లో ఏమేం చేయాలో ఫన్నీగా టిప్స్ అందించారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ వీడియో కొత్తగా ఉంది. ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించమే కాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రూపొందించటం విశేషం. విజయ్ ఈ వీడియో పోస్ట్ చేసిన తరువాత కొరటాల శివ స్పందిస్తూ “ఇలానే మంచి పనులు చేస్తూ మీ అమ్మతో నువ్వు మెప్పు పొందాలని కోరుకుంటున్నా”అని అన్నారు. ఇక మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

Vijaydevarakonda real man challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News