Saturday, April 27, 2024

ఉద్యోగుల డిఎ కోతపై మన్మోహన్ సింగ్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

Manmohan Singh

 

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, సాయుధ దళాలకు డిఎలో కోత విధించడానికి నిర్ణయం తీసుకోవడంలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి గురువారం 50 లక్షల కేంద్ర ఉద్యోగులకు, 51 లక్షల పెన్షనర్లకు, సాయుధ దళాలకు 2021 జూన్ వరకు కోత విధించనున్నట్టు ప్రకటించారు. దీనిపై మన్మోహన్ సింగ్ మండిపడుతూ ఈ కష్టసమయంలో ప్రభుత్వ ఉద్యోగులను, సాయుధ దళాలను అంత కష్టపెట్టాల్సిన అవసరం లేదని ఉద్యోగల పక్షాన తాము నిలబడతామని అన్నారు. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఈ అంశంపై ధ్వజమెత్తారు. ఈవిధంగా డిఎ కోత విధించే ముందు బుల్లెట్ రైలు, సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ఆపాలని మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు.

Manmohan Singh raps on DA cuts of employees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News