Friday, May 10, 2024

సకారియా తండ్రి కరోనాతో కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Sakariya father dead with corona virus

జైపూర్: చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. సకారియా తండ్రి కంజిబాయ్ కరోనాతో మృతి చెందాడు. వారం రోజుల క్రితం కంజిబాయ్ కి కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి దూరం నుంచి తన తండ్రిని సకారియా పరామర్శించాడు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సగం శాలరీ సరైన సమయంలో ఇవ్వడంతో తన తండ్రి చికిత్స కోసం ఉపయోగించానని మీడియాకు తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయాడు. ఐపిఎల్ 2021లో సకారియాను రూ1.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపిఎల్ లో జరిగిన ఏడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ, రైనా, రాయుడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News