Sunday, April 28, 2024

వ్యాధులు ప్రభలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : నాలుగు రోజులుగా జిల్లాలో నిరంతరాయంగా వర్షాలు పడి తగ్గుముఖం పట్టి నందన వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం టెలికాన్ఫెరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. వ్యాధులు ప్రభలకుండా మురుగు కాలువలలో చెత్తా చెదారం, గుంతలలో, రోడ్లపై నీరు నిలవకుం డా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపట్టాలని అన్నా రు. తాగునీరు కలుషితం కాకుండా అన్ని ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు.

నీటి సరఫరా పైప్ లైన్ లు లీకేజీలు లేకుండా మిషన్ భగీరథ అధికారులు పరిశీలించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని, వచ్చే మూడు రోజులు పరిశుభ్రతపై దృష్టి సారించి ప్రజలు రోగాల బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వైద్య శాఖ అధికారు లు తమ పరిధిలో వర్షాల కారణంగా సంభవించే సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, మూడు రోజుల పాటు డ్రైడే పాటించాలన్నారు. ఆశా వర్కర్లను అన్ని గ్రామాలలో ఇంటింటికి పంపి దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయడం, దోమల మందు పిచికారి చేయించాలన్నారు.

పాత తొట్టెలు, టైర్లు, డబ్బాలలో నీరు నిలవకుండా చూడాలన్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరుతో పాటు, వైద్య సేవలను మూడు రోజులపాటు పటిష్టంగా చేపట్టాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసినందున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులందరూ సిద్ధం కావాలని కలెక్టర్ అన్నారు. వచ్చే సోమవారం నుండి శనివారం వరకు హరితహారం కార్యక్రమం చేపట్టి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో 80 శాంతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈసారి హరితహారం కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని, తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు కనీసం 6 మీటర్లు తగ్గకుండా పెద్ద సైజు మొక్కలను నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, మొక్కలు నాటక ముందే ట్రీ గార్డులు, కాపలాదారులను నియమించుకోవాలని అన్నా రు. గ్రామ పంచాయతీలలో జిపి బిల్డింగుల నిర్మాణం కొరకు ఇప్పటివరకు స్థలాల సేకరణ జరగలేదని, ఆ జిపి లకు వెంటనే స్థల సేకరణ పనులను చేపట్టి నివేదిక అందించాలన్నారు. 30 లక్షలకు తక్కువ ఖర్చుతో చేపట్టే మన ఊరు మనబడి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని సూచించారు.

ఆయిల్ పామ్ పంటల సాగుకు జిల్లాలో రైతులను గుర్తించి వారి నుండి డిమాండ్ డ్రాఫ్ట్ లను సేకరించాలని అన్నారు. వర్షాల కారణంగా రైతుల కు నష్టం వాటిల్లకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అ ధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News