Monday, May 6, 2024

మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు
ఆందోళనలు విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి

మనతెలంగాణ/ హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని.. ఆందోళనలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మంగళవారం మంత్రి మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు తక్షణమే విరమించుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. సిఎం కెసిఆర్ తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మ న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలలో వెయ్యి కూడా లేని కార్మికులకు సిఎం కెసిఆర్ రూ.8,500లకు పెంచారు.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత సిఎందే అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికులను అవమానకరంగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ. 5,200, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6 వేలు ఇస్తున్నారు. ఛత్తీస్‌గడ్‌లో వేతనాలు కూడా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీల నుంచి చెల్లిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో పెయిడ్ వర్కర్స్ గా గుర్తిస్తూ, కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారు. కేరళలో కూడా సానిటేషన్ వర్కర్స్ పేరుతో ఇంటికి రూ.30 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఒక వార్డులో పని చేసే కార్మికునికి కనీసం 4 నుంచి 5 వేల రూపాయలు కూడా రావడం లేదు. దేశమంతా ఇలా ఉంటే, మన రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో పారిశుద్ధ్య కార్మికుల గౌరవం పెంచి, గ్రామాలను, పట్టణాలను స్వచ్ఛంగా మార్చి, దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఈ విజయంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మల్టీ పర్పస్ వర్కర్ల పాత్ర అమోఘం అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చేసే రాజకీయాల వలలో పడొద్దని విజ్ఞప్తి. కొందరు క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపునివ్వాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఇతర డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సిఎం దృష్టిలో కార్మికుల అన్ని విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారు. అప్పటి వరకు కార్మికులు ఓపికగా ఉండాలని కోరారు. వెంటనే ఆందోళనలు విరమించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News