Saturday, May 11, 2024

పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: మేయర్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో విష జర్వాలు ప్రబలకుండా పారిశుద్ద నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను అదేశించారు. శనివారం మేయర్ విజయలక్ష్మి జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం తన ఛాంబర్ లో పలు అంశాల పై కమిషనర్ తో సమిక్షించారు.వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో నివారణకు ముందు జాగ్రత్తల పై పూర్తి అవగాహన కల్పించే ఐఈసి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మేయర్ సూచించారు. మురికివాడలపై ఎక్కువ దృష్టిసారించాలి అన్నారు.

Also Read: కచిడి చేప@రూ.3.3లక్షలు

అసంపూర్తిగా ఉన్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ముఖ్యంగా ఎస్‌ఎన్‌డిపీ, మెయింటెనెన్స్ ఇతర సామాజిక పనులపై దృష్టి సారించాలన్నారు. పారిశుద్దాన్నికి సంబంధించి ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణకు అధికారులకు, సిబ్బంది ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ మేయర్‌కు వివరించారు. ఇస్తున్నట్లు తెలిపారు.జివిపీ పాయింట్స్‌తో పాటు నగరంలో మౌలిక సదుపాయాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగావార్డు కార్యాలయాల పని తీరును మరింత మెరుగు పర్చేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News