ఆసియాకప్‌లో సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) క్రికెట్ వ్యాఖ్యత అనే విషయం తెలిసిందే. ఈ ఆసియాకప్‌లోనూ ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సంజనా బాలీవుడ్ నటులు బాబీ డియోల్, రాఘవ్ జుయల్‌తో చిట్‌చాట్ జరిపింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు బుమ్రాపై తమ అభిప్రాయాలను డైలాగ్స్ రూపంలో తెలిపారు. సంజనా గణేశన్ కూడా ఆ డైలాగ్స్‌ని రిపీట్ చేసింది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ నుంచి ఓ డైలాగ్‌ని బుమ్రాకి అన్వయించి రాఘవ్, సంజనా (Sanjana Ganesan) కలిసి చెప్పారు. ‘‘ప్రపంచమంతా ఒకవైపు. నా బుమ్రా మరోవైపు’’ అనే డైలాగ్‌ని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో మరోసారి చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ(75)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Also Read : ఆరంభం అదిరినా.. చివర్లో తడబడిన భారత్