Sunday, April 28, 2024

ఎస్‌బీఐ బ్రాంచీలు.. సగం మంది ఉద్యోగులతోనే…

- Advertisement -
- Advertisement -

SBI employees covid positive
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో బ్యాంకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నేటి నుంచి ఈ నెల 30 వరకు తమ బ్రాంచీల్లో సగం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బీఐకి చెందిన బ్రాంచీల్లో వందల మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి దశలో 2000 మందికి పైగా ఎస్‌బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడగా.. రెండో దశలో ఇప్పటివరకు 600 మందికి వైరస్ సోకింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న ఉద్యోగులు, లోన్ ప్రాసెసింగ్ విభాగం సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. కరోనా ఉద్ధృతి దృష్టా డిజిటల్ సేవలకు ప్రాధాన్యమివ్వాలని మిశ్రా ఈ సందర్భంగా ఖాతాదారులను కోరారు.

అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కోరారు. సాధారణ ఉష్ణోగ్రత కలిగి మాస్క్‌లు ధరించిన వారినే లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సర్కిల్‌లోని కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా హెల్ప్‌లైన్ నంబరు 04023466233ను ఏర్పాటుచేసినట్లు మిశ్రా వెల్లడించారు. బ్యాంకు పనివేళల్లో ఈ నెంబరు పనిచేస్తుందని తెలిపారు. బ్రాంచీలు తెరిచి ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు ఇతర సందేహాల కోసం కస్టమర్లు ఈ నంబరుకు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు. అంతేగాక, హైదరాబాద్ కోఠి, సికింద్రాబాద్ ఎస్‌బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మిశ్రా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News