Friday, May 3, 2024

జవాను ప్రాణం తీసిన వ్యాక్సిన్ భయం

- Advertisement -
- Advertisement -

Jawan Commits Suicide In Jammu and Kashmir

 

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సిన్ భయంతో సిక్కోలుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే…. ఆంధ్రప్రదేశ్‌లోని కోటబొమ్మాళి మండలంలోని చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్ సిలిగూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ వేయించుకున్న తారకేశ్వరరావు ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇటీవల తన తండ్రితో అనారోగ్య సమస్యను చెప్పుకుని బాధపడిన తారకేశ్వరరావు పశ్చిమబెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగానే గన్ తో కాల్చుకుని చనిపోయాడని ఆర్మీ అధికారులు వివరిస్తున్నారు. గన్‌తో కాల్చుకుని రక్తపు మడుగులో ఉన్న తారకేశ్వరరావు ఫోటోలను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.అందరికి ధైర్యం చెప్పే తారకేశ్వరరావు సూసైడ్ చేసుకోవడంతో చౌదరికొత్తూరులో విషాధచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News