Tuesday, April 30, 2024

ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు త్వరతగతిన పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరత గతిన పరిష్కరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశి ంచారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశములో ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యు లు గొంగిడి సునితా మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ, పోలీసు శాఖ కృషి చేయాలని అన్నారు.

గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం పట్ల, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అందరికి ఉందన్నారు.జిల్లా కలెక్టర్ ప మేలా సత్పతి మాట్లాడుతూ,2022-23 సంవత్సరానికి 95% కేసుల పరిహారము క్రింద రూ. 90.00 లక్షలు మంజూరు చేయడమైనదని తెలిపా రు. ప్రతి మూడు నెలలకు ఒక సారి సమావేశం నిర్వహించేందుకు చ ర్యలు తీసుకుంటామని, కమిటీ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారము అందజేస్తామన్నారు.పౌరహక్కుల దినోత్సవము క్రమం తప్పకుండా షె డ్యుల్ ప్రకారము గ్రామాల్లో నిర్వహించాలని, రెండు రోజుల ముందు సంబంధిత గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

పౌరహక్కుల దినోత్సవము మీటింగ్ మినిట్స్ కాపీలు కలెక్టర్ కార్యాలయమునకు పంపినచో తదుపరి చర్యలు తీసుకవడం జరుగుతుందని,పౌర హక్కుల మీద ప్రచార కార్యక్రమాలను చేపడతామని ఇ ందులో విద్యా, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొనాలని తెలిపారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ యం.రాజేష్ చంద్ర మాట్లాడు తూ,సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ కేసుల్లో ఫిర్యాదుదారులకు చార్జ్ షీట్ కాపీ ఇవ్వబడుతుందని తెలిపారు.పౌర హక్కుల ప్రచార కార్యక్రమములో పోలీసు శాఖ వారు కూడా పాల్గొంటారని తెలిపారు.

సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు మొగులయ్య, వెంకటరెడ్డి, శివరామిరెడ్డి, మానిటరింగ్ కమిటీ సభ్యులు సర్పం శివలింగం, బర్రె సుదర్శన్, కంచనపల్లి నర్సింగరావు, దాసరి తిరుమలేష్, రాజన్ నాయక్, భాస్కర్ గౌడ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగిరెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి యం. జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News