Saturday, May 4, 2024

ఇడి చీఫ్ మిశ్రా పదవీకాలం సెప్టెబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధిపతి సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు సుప్రీంకోర్టు గురువారం పొడిగించింది. అయితే..ఇక తదుపరి పొడిగింపు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అక్టోబర్ 15 వరకు ఇడి చీఫ్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రం కోరినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే పొడిగించడానికి ఆమోదం తెలిపింది. ప్రజా, జాతీయ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిశ్రా పదవీకాలం పెసెప్టెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టియ్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

విచారణ సందర్భంగా మిశ్రా పదవీకాలం పొడిగింపును ఎందుకు కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మిశ్రా తప్ప ఇడిలోని మిగిలిన అధికారులందరూ అసమర్థులా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇడిలోని ఇతర అధికారులంతా అసమర్థులన్న అభిప్రాయాన్ని మనం కల్పించడం లేదా అని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News