Monday, April 29, 2024

యూపి సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసు..

- Advertisement -
- Advertisement -

SC Issues Notice to UP Govt on Ashish Mishra Bail Petition

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు యూపి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. లఖింపుర్ ఖేరీ హింసాత్మక సంఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కేంద్ర మంత్రి తనయుడు ఆశీష్‌మిశ్రాని నిందితుడిగా పేర్కొటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జైల్లో ఉన్న ఆశీష్‌మిశ్రా జులై 26న అలహాబాద్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే లక్నో బెంచ్ ఆశీష్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు ఆర్డరును సవాల్ చేస్తూ ఆశీష్‌మిశ్రా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఎంఎం సండ్రేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం యోగీ సర్కారుకు నోటీసు జారీ చేసింది. ఆశీష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం తమ స్పందన తెలియజేయాల్సిందిగా కోరింది.

అనంతరం తదుపరి విచారణను ఈ నెల వాయిదా వేసింది. కాగా గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. యూపి డిప్యూటీ సిఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య పర్యటనను పురస్కరించుకుని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈఘటనలో రైతులను ఆశీష్‌మిశ్రా తన ఎస్‌యువి వాహనంతో ఢీకొట్టడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం రైతుల దాడిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, డ్రైవర్‌తోపాటు ఓ విలేఖరి ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టులో ఆశీష్ మిశ్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి మాట్లాడుతూ..పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్నొన్నట్టు ఆశీష్ కారును డ్రైవ్ చేయలేదని వెనుక సీటులో కూర్చున్నారని విన్నవించారు. ఘటన సమయంలోనే డ్రైవర్‌పై రైతులు మూకుమ్మడి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

SC Issues Notice to UP Govt on Ashish Mishra Bail Petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News