Saturday, May 4, 2024

ఉపకార వేతనాల నమోదుకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ,హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఉపకార వేతనాల మంజూరు, రెన్యూవల్ కోసం తెలంగాణ ఇ -పాస్ వెబ్‌సైట్‌లో కళాశాలలు, విద్యార్థుల నమోదు చేసుకునేందుకు జనవరి నెలాఖరు వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ కార్యదర్శి రాహుల్‌బొజ్జా తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిస్తోందని, ఉపకార వేతనాల మంజూరు, పంపిణీలో పారదర్శకత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఈ పాస్ వెబ్‌సైట్ : telanganaepass.cgg.gov.inలో ఉపకార వేతనాల మంజూరు, నమోదుకు కళాశాలలు, విద్యార్థుల అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పిజి కళాశాలలు, కొత్తగా చేరిన విద్యార్థుల నమోదు గడువును 2022 జనవరి 31వరకు ప్రభుత్వం పొడిగించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News