Sunday, April 28, 2024

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో ఆశాజనకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సమన్వయంతో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ యాంటీబాడీల ఉత్పత్తిలోను, కణమధ్యవర్తిత్వవ్యాధి నిరోధక స్పందన లోను అద్భుతమైన ఫలితాలు చూపిస్తోందని భారత్‌తోపాటు వివిధ దేశాల శాస్త్రవేత్తలు తమ స్పందన తెలియచేశారు. అయితే ఈ ఫలితాలతో సంతృప్తి పడరాదని, ఇంకా మరింత దూరం ముందుకు వెళ్లాల్సి ఉందని వారు సూచించారు. లాన్సెట్ అధ్యయనం ఈ వ్యాక్సిన్ సురక్షితమే కాక, వ్యాధినిరోధక స్పందనను విశేషంగా ప్రేరేపిస్తోందని వెల్లడించడంతో శాస్త్రవేత్తల సమాజం తమ అభిప్రాయాలను వెల్లడించింది.ఇది చాలా భరోసా కలిగిస్తుందని, సుఖవంతమైనదని, ఆసక్తి దాయకమని శాస్త్రవేత్తలు వివరించారు. మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ బ్రిటన్ ఆస్పత్రుల్లో గత ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించారు. 18 నుంచి 55 ఏళ్ల లోపు ఆరోగ్యవంతులైన 1077 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

వైరాలజిస్టు ఉపాసన రే ఈ వ్యాక్సిన్ ఆదర్శమైనదని ప్రశంసించారు. హ్యుమొరల్, కణమధ్యవర్తిత్వ వ్యాధినిరోధక శక్తిని (సెల్‌మెడియేటెడ్ ఇమ్యూనిటీ) పెంపొందించ గలుగుతోందని ఆమె చెప్పారు. శరీరంలోని బి కణాల నుంచి యాంటీబాడీలు ఉత్పత్తి కావడం హ్యుమొరల్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు. ఇవి వ్యాధినిరోధక శక్తిలో ప్రొటీన్ భాగాలు తయారవడం ఇందులోని ప్రక్రియ. టి కణాలు కణమధ్యవర్తిత్వ వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయని ఆమె వివరించారు. ఉపాసన రే కోల్‌కతా సిఎస్‌ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోలజీ సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు. ఈ రెండు ప్రక్రియలు వ్యాధినిరోధక సంబంధ స్పృహకు, సుదీర్ఘ సంరక్షణకు అవసరమని ఆమె తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ వ్యాక్సిన్ సెంటర్ ప్రొఫెసర్, డైరెక్టర్ బీట్ కాంప్‌మన్ ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు.

ఒకే ఒక్క డోసుతో చాలా కేసుల్లో ముఖ్యమైన అన్ని యాంటీబాడీలు తటస్థీకరణం ఆయ్యాయని అన్ని కేసుల్లో రెండు డోసులతో తగిన ఫలితాలు కనిపించాయని, బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ వైరాలజీ ప్రొఫెసర్ ప్రఖ్యాత ఐయాన్ జోన్స్ పేర్కొన్నారు. న్యూఢిల్లీ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ సైంటిస్టు సత్యజిత్ రథ్ ఈ వ్యాక్సిన్ అనుకోని భయంకర ప్రతికూల పరిణామాలను ఏవీ కల్పించలేదని చెప్పారు. ఈ వ్యాక్సిన్ వల్ల తలెత్తే చిన్నపాటి రుగ్మతలు తలనొప్పి, అలసట, వంటివి అంతగా పట్టించుకోవలసిన సమస్యలు కావని పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని బ్రిటన్‌కు చెందిన ఫార్మాకోఎపిడెమియోలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవాన్స్ వ్యక్తం చేశారు. వెలువడే రోగ నిరోధక ప్రతిస్పందన, కల్పించబడే రోగనిరోధక రక్షణ ఎల్లప్పుడూ సమాంతరంగా అమలు కాకపోవచ్చని రే అభిప్రాయపడ్డారు. అందువల్ల సుదీర్ఘకాల జనాభా ఆధార అధ్యయనాలు అవసరమౌతాయని సూచించారు. అయితే సుదీర్ఘ పర్యవేక్షణ ఫలితంగా ప్రతికూలత ఏర్పడి రోగ నిరోధక శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

Scientists Encouraged to Oxford vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News