Saturday, May 11, 2024

లైసెన్సు లేకుండా భారీ మొత్తంలో డ్రగ్స్ అమ్మకం

- Advertisement -
- Advertisement -

క్లీనిక్‌పై డిసిఎ దాడులు… రూ.95 వేల విలువైన 36 రకాల మందులు స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్ : లైసెన్సు లేకుండా భారీ మొత్తంలో డ్రగ్స్ అమ్మకానికి ఉంచిన దొంగలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డిసిఎ డైరెక్టర్ జనరల్ విబి కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలం, పాలకొండ గ్రామంలో ‘న్యూ లైఫ్ కేర్ క్లినిక్’ పేరుతో ఎస్.మురహరి అనే క్వాక్ క్లినిక్ నడుపుతున్న ఎస్.మురహరి ఆవరణపై అధికారులు సోమవారం దాడి చేశారు. దాడిలో రూ.95,000 విలువైన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్, అనాల్జెసిక్స్ తదితర 36 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలం పాలకొండ గ్రామంలోని తన క్లినిక్ ‘న్యూ లైఫ్ కేర్ క్లినిక్’లో అర్హత లేకుండా మెడిసిన్ చేస్తున్న ఎస్.మురహరి అనే వ్యక్తిపై మహబూబ్‌నగర్ జోన్ డిసిఎ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో, డ్రగ్ లైసెన్స్ లేకుండా ఆవరణలో నిల్వ ఉంచిన భారీ మందుల నిల్వలను డిసిఎ అధికారులు గుర్తించారు. యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్, అనాల్జెసిక్స్ మొదలైన ముప్పై ఆరు రకాల మందులు ప్రాంగణంలో నిల్వ చేయగా, అధికారులు ఆ నిల్వలను సీజ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News