Friday, April 26, 2024

అస్థిరంగా మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Sensex rose by slight 160 points last week

గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. యుఎస్ మార్కెట్లు వరుసగా నష్టాలను చూస్తున్నాయి. అదే విధంగా భారతదేశం ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2వరకు చూస్తే, సెన్సెక్స్ స్వల్పంగా 163 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. వచ్చే వారం కూడా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, గ్లోబల్ మార్కెట్లు, చమురు ధరల కదలికలు, రూపాయి విలువ, ఇతర అంశాలు మార్కెట్ కు కీలకమని అంటున్నారు. అమెరికా ఫెడ్ ప్రకటన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారో అని ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 మొదటి త్రైమాసికంలో భారతీయ జిడిపి 13 శాతానికి పైగా నమోదైంది. ఇది మార్కెట్ కు సానుకూలం అంశంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ వృద్ధి రేటును 8.8 శాతం నుండి 7.7 శాతానికి కోత పెట్టడం కొంత ఆందోళన కల్గిస్తోంది.

అయితే వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను చూసింది. అయితే ఉదయం గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైన తరువాత మార్కెట్ రెడ్ మార్క్‌కు వచ్చింది. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 36 పాయింట్ల లాభంతో 58,803 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 3.35 పాయింట్లు క్షీణించి 17,539 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్‌లోని చాలా రంగాల షేర్లలో పతనం వచ్చింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, మీడియా రంగాలు పుంజుకోగా, ఆటో, రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటి, ఫార్మా, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా పతనంతో ముగిశాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 15 షేర్లు గ్రీన్‌గా ముగియగా, 35 షేర్లు పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 11 స్టాక్‌లు మాత్రమే గ్రీన్ మార్క్‌లో ముగియగా, 19 రెడ్ మార్క్‌లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 షేర్లలో 7 స్టాక్‌లు రెడ్ మార్క్‌లో, మిగతా 5 గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. స్టాక్స్‌ను పరిశీలిస్తే రిలయన్స్ 1.19 శాతం, మారుతీ సుజుకీ 1.19 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.04 శాతం, నెస్లే 0.91 శాతం, పవర్ గ్రిడ్ 0.86 శాతం, టాటా స్టీల్ 0.85 శాతం, ఇన్ఫోసిస్ 0.79 శాతం, అల్ట్రా టెక్ 70 శాతం క్షీణతతో ముగిశాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి 1.75 శాతం, ఐటిసి 1.72 శాతం, లార్సెన్ 1.49 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.95 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.92 శాతం, ఎన్‌టిపిసి 0.68 శాతం, కోటక్ మహీంద్రా 0.64 శాతం, ఎస్‌బిఐ 0.59 శాతం, టెక్ మహీంద్రా 2 శాతం లాభంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News