Friday, April 26, 2024

నా భర్తను విలన్‌గా చిత్రీకరిస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

Shakib al hasan's Wife react to On Field Incident

ఢాకా: ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిల్ అల్ హసన్ వికెట్లను తన్నడం, వాటిని తీసి నేలకేసి కొట్టడం లాంటివి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో షకిబ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై షకిబ్ భార్య ఉమ్మే అల్ హసన్ స్పందించింది. తన భర్త షకిబ్‌ను ప్రతిదాంట్లో విలన్ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత కాలంగా తన భర్త షకిబ్‌ను మీడియా లక్షంగా చేసుకుందని, ఈ క్రమంలో అసత్య ప్రచారానికి దిగుతోందని వాపోయింది. వికెట్లను కొట్టిన విషయంలో కూడా మీడియా వాస్తవాలను కప్పిపుచ్చి షకిబ్‌నే విలన్‌గా చూపించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. అయితే, ఇందులో షకిబ్ తప్పేమీ లేదని అంపైర్లు కావాలనే పక్షపాతం చూపించడంతో సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Shakib al hasan’s Wife react to On Field Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News