Tuesday, April 30, 2024

ప్రపంచం నవ్వుతుంది.. శివశక్తి పాయింట్‌పై కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చంద్రయాన్3 విజయవంతంతో ప్రధాని మోడీ చంద్రుడిపై శివశక్తి పాయింట్ ఏర్పాటు ప్రకటన చేయడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ నేత రషీద్ అలీ ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని ఏ పేరు పడితే ఆ పేరు పెట్టడమేనా అని తెలిపిన కాంగ్రెస్ నేత చంద్రుడిపై ఇంతకు ముందటి జవహర్ పాయింట్ సంగతి ఏమిటని నిలదీశారు. చంద్రయాన్ 1 పతనం అయిన ప్రాంతానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట జవహర్ పాయింట్ అని పేరు పెట్టడాన్ని రషీదు ప్రస్తావించారు.

చంద్రుడిపై విజయం సాధించాం, ఇది అందరికీ గర్వకారణమే. ఇందులో సందేహం లేదు. కానీ మనం చంద్రుడిపై కానీ అక్కడి ఏదో ఒక ప్రాంతంపై కానీ మనం కానీ మరెవ్వరం కానీ సొంతదార్లం కామని అల్వీ తెలిపారు. చంద్రుడిపై విజయానికి ప్రధాని మోడీ ఈ విధంగా స్పందించడం, చంద్రుడి ప్రాంతానికి పేరు పెట్టడం ఎబ్బెటుగా ఉందని, ప్రపంచం అంతా నవ్వుతుందని వ్యాఖ్యానించారు. శివశక్తి పాయింట్‌కు, జవహర్ పాయింట్‌కు పోలిక లేదన్నారు. నెహ్రూను సరిపోల్చడం కుదరదన్నారు. పండిట్ నెహ్రూ వల్లనే ఇప్పటి ప్రగతి అంతా సాధ్యం అయిందన్నారు.

అయితే ఇప్పటి ప్రధాని మోడీ ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అల్వీ వ్యాఖ్యలపై బిజెపి తరఫున పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ వైఖరి ఇటువంటి వాదనలతో స్పష్టం అయిందన్నారు. శివశక్తి పాయింట్, తిరంగా పాయింట్లు ఈ రెండూ దేశానికి ముడివడినవి. ఇందులో కాంగ్రెస్‌కు ఏ తప్పు కన్పించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పూర్తిగా కుటుంబం ప్రధమం అనే సిద్ధాంతపు పార్టీ అని ఈ కోణంలోనే పార్టీ ఆలోచనలు ఉంటాయని తెలిపారు. విక్రమ్ ల్యాండర్‌కు విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News