Saturday, May 4, 2024

జ్ఞానవాపి మసీదు బావిలో శివలింగం

- Advertisement -
- Advertisement -

ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని కోర్టు ఆదేశం

Shiva Lingam found in Gyanvapi Masjid

వారణాసి : కాశీ విశ్వనాధుని ఆలయం సమీపం లోని జ్ఞానవాపి మసీదు లోపల శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానియ యంత్రాంగాన్ని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే సోమవారం నాడు పూర్తయింది. ఇక్కడున్న బావిలో శివలింగం బయటపడినట్టు హిందూ అడ్వకేట్లు ప్రకటించారు. శివలింగానికి రక్షణ కల్పించాలంటూ న్యాయవాది విష్ణుజైన్ నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌కు కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని వెంటనే సీజ్ చేయాలని, విజిటర్ల ప్రవేశాన్ని నిషేషిధించాలని కోర్టు ఆదేశించింది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్ , సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌లకు ఆదేశాలిచ్చింది.

సర్వే వర్క్‌పై అడ్వకేట్ కమిషనర్లు ఎలాంటి వివరాలను బహిర్గతం చేయనప్పటికీ తమ సర్వేలో తేలిన వివరాలను మంగళవారం నాడు కోర్టుకు తెలియజేయనున్నట్టు చెప్పారు. సర్వేలో సమగ్ర సాక్షాలు లభ్యమైనట్టు జ్ఞానవాపి కేసులో పిటిషనర్ సోషల్ లాల్ ఆర్య తెలిపారు. బాబా మిల్ గయే అంటూ ముక్తసరి సమాధానం ఇచ్చారు. హిందువుల తరఫు అడ్వకేట్ మోహన్‌యాదవ్ దీనిపై మాట్లాడుతూఏ 12 అడుగుల 8 అంగుళాల వ్యాసార్థంలో శివలింగం ఉన్నట్టు చెప్పారు.

మసీదు ప్రాంగణంలో శని, ఆది వారాల్లో సర్వే నిర్వహించారు. నమాజుకు ముందు ముస్లింలు తమ కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే చెరువు ను సర్వే కోసం ఖాళీ చేశారు. ఆ చెరువు లోనే శివలింగం దొరికినట్టు చెబుతున్నారు. జ్ఞానవాపి కాంప్లెక్స్ వెస్టర్న్ వాల్ వద్ద హిందూ ఆలయం కూల్చివేతకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగో లాక్‌ను సోమవారం నాడు తెరిచారు. మొదటి మూడు గదులు శనివారం నాడు సర్వే కోసం తెరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News