Friday, May 3, 2024

హర్యానాలో రెజ్లింగ్ సెంటర్‌పై కాల్పులు

- Advertisement -
- Advertisement -

Shooting at the wrestling center

 

కోచ్ దంపతులు, ఇద్దరు మహిళా రెజర్లు సహా ఐదుగురు మృతి
వ్యక్తిగత కక్షలే కారణంగా పోలీసులు అనుమానం
పరారీలో ప్రధాన నిందితుడు

రోహ్‌తక్: హర్యానాలోని రోహ్‌తక్‌లో ఘోరం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి రెజ్లింగ్ సెంటర్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయిదుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళా రెజ్లర్లు, కోచ్, ఆయన భార్య, ఒక చిన్నారి ఉన్నారు. శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుగురు మృతి చెందారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రోహ్తక్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ శర్మ చెప్పారు. ఒక ప్రైవేట్ కాలేజిలోని రెజ్లింగ్ సెంటర్‌లో ముగ్గురు వ్యక్తులను కోచ్‌లుగా, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించారు.

వారిలో ఒకరైన ప్రధాన నిందితుడు సుఖ్విందర్‌ను అతనిపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగంనుంచి తొలగించారు. దీనిపై ఆగ్రహించిన సుఖ్విందర్ కాలేజిలోపలే ఉన్న రెజ్లింగ్ సెంటర్‌లోని తన సహచరులపై కాల్పులు జరిపాడు. మృతుల్లో కోచ్ దంపతులు మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీశ్ కుమార్, మహిళా రెజ్లర్లు పూజ,, ప్రదీప్ మాలిక్‌లుగా గుర్తించారు. నిందితుడిపై ఐపిసి 302,307 సెక్షన్లు, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News