Wednesday, May 8, 2024

ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడింది

- Advertisement -
- Advertisement -

Shraddha das

 

‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ భామకి టాలీవుడ్‌లో ఆఫర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. కానీ బాలీవుడ్‌లో ఒకటీ అరా అవకాశాలతో, చేతి నిండా వెబ్ సిరీస్‌లతో ప్రస్తుతం బిజీగానే ఉంది ఈ బ్యూటీ. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రద్ధా చేస్తున్న గ్లామర్ హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో హద్దులు మీరి అందాలొలకబోస్తూ యూత్‌ను మురిపిస్తోంది. శ్రద్ధాదాస్ గ్లామర్ తెలుగు ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడింది. ఈ మధ్యనే ఓ ప్రముఖ దర్శకుడు శ్రద్ధాదాస్‌ను లీడ్ రోల్‌లో పెట్టి ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట. అందుకు మరో ప్రముఖ నిర్మాత కూడా ముందుకొచ్చినట్లు తెలిసింది. ‘ఆర్‌ఎక్స్ 100’ రేంజ్‌లో ఆ సినిమాని తెరకెక్కించి ఫుల్‌గా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే శ్రద్ధాదాస్‌కు అదృష్టం కలిసివచ్చినట్లే. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో ఈ బ్యూటీ నటిస్తోంది.

 

Shraddha das came into filmmakers view
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News