Saturday, April 27, 2024

14న వరంగల్‌లో రాయల్ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

‘Shyamsingha Roy’ Royal Event on Dec 14th

 

నేచులర్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్’ని ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈనెల 14న ‘శ్యామ్‌సింగ రాయ్’ రాయల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నారు. నానితో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఇక సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News