Tuesday, April 30, 2024

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సైమా అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

Siima Awards for 'Ala Vaikuntapuram'

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డును అందుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ‘సైమా 2020’లో ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ గాయకుడు విభాగాలలో అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ నటిగా పూజా హెగ్డేలకు అవార్డులు దక్కాయి. ఈ వేడుకకు హాజరైన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఈ ఆవార్డుల వేడుకలో అల్లు అర్జున్, అందాల తారలు నిత్యాశెట్టి, శుభ్ర అయ్యప్ప, ప్రియాంక శర్మ, శ్వేత షిండే, కొమల్ శర్మ తదితరులు పాల్గొని సందడి చేశారు.

2020 (తెలుగు) విజేతల వివరాలు…

ఉత్తమ చిత్రం : అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్&గీతా ఆర్ట్)

ఉత్తమ దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : సుధీర్‌బాబు (వి)

ఉత్తమ నటి : పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటి (క్రిటిక్స్) : ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)

ఉత్తమ సహాయ నటుడు : మురళీ శర్మ (అల వైకుంఠపురములో)

ఉత్తమ సహాయ నటి : టబు (అల వైకుంఠపురములో)

ఉత్తమ సంగీత దర్శకుడు : ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయకుడు : అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయని : మధుప్రియ (హి ఈజ్ సో క్యూట్, -సరిలేరు నీకెవ్వరు)

ఉత్తమ విలన్ : సముద్రఖని (అల వైకుంఠపురములో)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News