Sunday, April 28, 2024

వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. వానకాలం ఎరువులపై శుక్రవారం హాకాభవన్‌లో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం కోసం గతంలో కోరిన రేక్ పాయింట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరాలని సూచించారు.

రేక్ పాయింట్లలో ఎరువులు 24 గంటలలో అన్‌లోడ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. – రామగుండం ఎరువుల కార్మాగారం వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. – క్షేత్రస్థాయికి ఎరువుల నిల్వలు చేరే విధంగా అధికారులు ఇప్పటి నుంచే తగు ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. – కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లు ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఏప్రిల్ వాటా 35 వేల మెట్రిక్ టన్నులు, ఈ నెల వాటా కింద 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే తీసుకురావాలన్నారు. – రాష్ట్రంలో 2.68 లక్షల యూరియాతో కలిపి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల వరకు – 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, లక్ష ఇతర ఎరువులు బఫర్ నిల్వల కింద అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి సింగిరెడ్డి ఆదేశించారు. -ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్క్ ఫెడ్, రైల్వే , అగ్రోస్ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హ్యాడ్లింగ్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News