Saturday, May 4, 2024

‘ప్రిన్స్’ను సవాల్‌గా తీసుకొని చేశాం

- Advertisement -
- Advertisement -

Sivakarthikeyan Interview about PRINCE

శివకార్తికేయన్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన పూర్తి ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న ‘ప్రిన్స్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
యూనివర్సల్ సబ్జెక్ట్…
దర్శకుడు అనుదీప్ చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది ‘ప్రిన్స్’గా మారింది. ‘ప్రిన్స్’ యూనివర్షల్ సబ్జెక్టు. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్‌గా వుంటాయి.
ఆద్యంతం ఆసక్తికరంగా…
ప్రిన్స్ స్టొరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ఇండియన్ బ్రిటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా వుంటుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్‌ని బ్రేక్ చేసే ఆలోచన ఆసక్తికరంగా ఉంటుంది.
సవాల్‌గా తీసుకొని చేశాం…
ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్‌గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్‌లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన వుంది.
అందుకే ‘ప్రిన్స్’ అని పెట్టాం…
ఈ సినిమా కథలో బ్రిటిష్ కనెక్షన్ వుంది. ఒక కింగ్‌డమ్ ఫీలింగ్ వుంటుంది. అలాగే నా అభిమానులు నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. అలా ఈ చిత్రానికి ‘ప్రిన్స్’ అని పేరు పెట్టాం.

Sivakarthikeyan Interview about PRINCE

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News