Friday, May 3, 2024

విక్రమ్-2 కోసం రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరానికి చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ అయిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ గత ఏడాది అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించి దేశంలోనే తొలి ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. నేడు (ఏప్రిల్ 4న) ఆ కంపెనీ 3డి-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ‘ధావన్-2’ని నాగ్ పూర్ లో విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది.

2024లో ప్రయోగించనున్న వారి విక్రమ్-2 రాకెట్ ఎగువ దశలో ఈ ఇంజన్ ఉపయోగించబడుతుంది. అయితే దీనికి ముందు స్కైరూట్ ఏరోస్పెస్ తమ వాణిజ్య కార్యాకలాపాలను విక్రమ్-1తో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2023లో ప్రయోగించబడుతుంది.

‘విక్రమ్-1, విక్రమ్-2…రెండింటి అభివృద్ధి పనులు ఒకేసారి జరుగుతున్నాయి. అయితే విక్రమ్-1 మొదట ప్రయోగించబడుతుంది. కాగా విక్రమ్-2 వచ్చే ఏడాది ప్రయోగించబడుతుంది’ అని స్కైరూట్ ఏరోస్పేస్ సిఈవో, వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News