Tuesday, April 30, 2024

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు: భార్యభర్తల మధ్య గొడవకు మనస్థాపం చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంగనాయక సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెం దిన పుట్ల కిరణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా గోదావరిఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహాం జరిగింది. వీరిద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెళ్లి అయిన నెల నుంచే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితం కిరణ్ కుమార్ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. అలాగే గోదావరి ఖరిలో ఆశ్వీని కూడా కిరణ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 22న కౌన్సిలింగ్‌కు రమ్మని కిరణ్‌కుమార్‌ను గోదావరి ఖని పోలీసులు పిలిచారు.

21న ఆర్ధరాత్రి కిరణ్‌కుమార్ సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చాడు. తన మేన బావమరిది పల్లే నరేందర్‌తో కలిసి 22న సాయంత్రం రంగనాయక సాగర్ కట్టపై బైక్ మీద వెళ్లారు. తాను ఫోన్ మాట్లాడతానని తనకు ఫోన్ ఇవ్వమని నీవు ఇక్కడే ఉండమని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు. చాలా సేపు అయినా రాకపోయే సరికి వెళ్లగా పోన్ కట్టపై ఉందని మా బావ కనిపించలేదు. పోలీసులు కౌన్సిలింగ కు భయపడి పారిపోయి ఉండవచ్చని నరేందర్ బావించాడు. గురువారం రంగనాయక సాగర్‌లో మృత దేహం లభించగా అది కిరణ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బావమరిది నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News