Saturday, May 4, 2024

జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంద ని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సికిల్ సెల్ నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ్రమ, గురుకుల, గిరిజన, ప్రాథమిక పాఠశాలలో బాలికల కు సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు బాలికల పేర్లు, అధా ర్‌నెంబర్‌లు, వివరాలను సేకరించి ఈ నెల 27 వ తేది నుండి ప్రారంభమయ్యే సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 20 కమిటిలు, ఉప కేంద్రాల పరిధిలో 18 కమిటీలు ఉన్నాయని, వీటిలో 50 శాతం మహిళలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, సర్పంచ్‌లు, ఎంపిపిలు తప్పనిసరిగా సమాచారం అందించాలని తెలిపారు. వర్షకాలం ప్రారంభమైనందున పాఠశాల ఆవరణ, పరిసరా ప్రాంతాలలో మురుగునీరు నిల్వ లేకుండా గ్రామపంచాయితీ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తంబాకు నియంత్రణ సంబంధిత గో డప్రతులను ఆవిష్కారించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News